NLG: చిట్యాలలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం, రెండవ రోజు పసుపు రంగు వస్త్రంలో గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పులిహోర, రవ్వకేసరిని నైవేద్యంగా సమర్పించారు. ఆలయంలో ఉత్సవాల రోజుల్లో ప్రతినిత్యం కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ఆలయ ఛైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు పూజలో పాల్గొన్నారు.