VSP: దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘స్వచ్ఛోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జీవీఎంసీ 6వ వార్డు మధురవాడ పరిధిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ సాయి కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 6వ వార్డు సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ఉత్సాహంగా పాల్గొని వార్డు పరిధిలోని పలు ప్రాంతాలను శుభ్రం చేశారు.