సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో సినిమా రాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై నిర్మాత సునీల్ నారంగ్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అలాంటి ప్రాజెక్టు ఏదీ లేదని, అవన్నీ రూమర్స్ మాత్రమేనని చెప్పారు. తాను ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.