AKP: ఎలమంచిలి పట్టణంలో ఈనెల 21న వర్షంతో పాటు వీచిన గాలులకు విద్యుత్ శాఖకు భారీ నష్టం జరిగింది. 32 విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. 6 కిలోమీటర్ల మేర విద్యుత్ వైర్లు దెబ్బతిన్నాయి. పట్టణంలో పలుచోట్ల చెట్లు కొమ్మలు విద్యుత్ లైన్లపై పడటంతో పెద్ద నష్టం జరిగింది. సుమారు 27 గంటల పాటు పట్టణంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు పలు ఇబ్బందులు పడ్డారు.