KNR: కరీంనగర్ SRR ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలోని తెలుగు శాఖ ఆధ్వర్యంలో డా. బోయి భీమన్న జయంతి వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు డా. బూర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సాహితీ క్షేత్రంలో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప కవి పద్మభూషణ్ డా. బోయి భీమన్న అని అన్నారు. పలువురు అధ్యాపకులు వారు చేసిన సాహితీ కృషిని కొనియాడారు.