W.G: భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి నిన్న పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై గూగుల్ మీల్ ద్వారా సమీక్షించారు. ఈ సీజన్లో జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. త్వరలో మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశిస్తామని ఆయన పేర్కొన్నారు.