BDK: భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్‌గా జంగయ్యను నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతన డిపో మేనేజర్‌గా జంగయ్య భద్రాచలం ఆర్టీసీ డిపోలో బాధ్యతలను స్వీకరించారు. అతను మహబూబ్‌నగర్ జిల్లా ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ పదోన్నతిపై భద్రాచలం ఆర్టీసీ డిపో మేనేజర్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఆర్టీసీ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.