TG: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనపై CM రేవంత్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌లు నిన్న భేటీ అయ్యారు. పలు జిల్లాల్లో కోర్టులు అద్దె భవనాల్లో నడుస్తున్న విషయాన్ని సీజే ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.