AKP: చోడవరం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ లక్ష్యం రూ.200 కోట్లకు చేరుకోవాలని డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు సూచించారు. శనివారం స్థానిక డీసీసీబీ బ్రాంచ్‌ను సందర్శించారు. బ్యాంకులో జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించారు. ప్రస్తుతం బ్యాంకు టర్నోవర్ రూ.170 కోట్లు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. రైతులకు సకాలంలో పంట రుణాలను అందించాలని తెలిపారు.