SKLM: కోటబొమ్మాళి గ్రామంలో జరిగే కొత్తమ్మ తల్లి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం తెలిపారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో అంగరంగ వైభవంగా జాతర నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భద్రతా పరమైన చర్యల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.