శ్రీలంక యువ క్రికెటర్ దునిత్ వెల్లలగే కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. నిన్న శ్రీలంక, అఫ్గాన్ మ్యాచ్ జరుగుతుండగా.. దునిత్ తండ్రి హఠాన్మరణం చెందారు. అయితే, ఈ వార్తను మ్యాచ్ పూర్తయ్యే వరకు దునిత్‌కు తెలియనివ్వలేదు. అఫ్గాన్‌పై విజయం తర్వాత కోచ్ జయసూర్య ఈ వార్త చెప్పగా, దునిత్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. అందుకే, మ్యాచ్ గెలిచినా శ్రీలంక ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోలేదు.