ప్రకాశం: మార్కాపురం సబ్ డివిజన్లో సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉందని డీఎస్పీ నాగరాజు తెలిపారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెక్షన్ 30 అమలులో ఉండడం వలన పోలీసు శాఖ నుంచి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు సంబంధించి ర్యాలీ, ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు. శాంతి పద్ధతులకు నిఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.