JGL: పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు కూడా నోటీసులు అందాయి. ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలుపెట్టనున్న స్పీకర్, మరిన్ని ఆధారాలు కావాలని నోటీసుల్లో కోరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరడంతో ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు.