MBNR: జిల్లాకు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికాలోని కాలిఫోర్నియాలో పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన అతను ఉద్యోగం లేకపోవడంతో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఈనెల 3న, రూమ్మేట్స్ మధ్య గొడవ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘర్షణ తగ్గకపోవడంతో పోలీసుల కాల్పుల్లో అతను మృతి చెందాడు.