‘ఈ ఫైల్‌ను వెంటనే డిలీట్ చేయండి’ అంటూ గౌతమ్ గంభీర్ సీరియస్ ట్వీట్ చేశాడు. అర్థం లేని స్వభావంతో తాను ప్రవర్తించినట్లుగా ప్రమోషన్స్ కోసం CRED రూపొందించిన ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. CRED దీన్ని డిలీట్ చేయకపోగా రీపోస్ట్ చేయడం గమనార్హం. దీంతో గంభీర్ నిజంగానే డిలీట్ చేయమన్నాడా? లేక మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం ఇలా చేశాడా? అని నెట్టింట చర్చ నడుస్తోంది.