SDPT: నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూర్ మండలంలో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో గంగాపూర్ గ్రామానికి చెందిన రైతు పిరెల్లి ఐలయ్యకు చెందిన పాడి ఆవు పిడుగు పాటుతో మృతి చెందింది. దీంతో రైతు ఐలయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో దాదాపు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు.