టాలీవుడ్ హీరో నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ‘సుందరకాండ’ మూవీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రముఖ OTT వేదిక జియో హాట్స్టార్లో పాన్ ఇండియా స్థాయిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్, విర్తి వాఘని కీలక పాత్రలు పోషించారు.