W.G: జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవాలయాలలో అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి అని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్‌ను వినియోగించరాదని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకుండా జిల్లా అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు.