AP: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ అంకురార్పణతో ప్రారంభంకానున్నాయి. రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా భక్తులకు 16 రకాల వంటకాలు పంపిణీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.