PLD: చిలకలూరిపేటలోని భావనాఋషి నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఆదినారాయణ (39) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని రూరల్ ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. సోమవారం పసుమర్రు గ్రామ సమీపంలోని గొర్రెల మండి వద్ద పొలాల్లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.