SRD: ప్రభుత్వ ఆసుపత్రులను పరిశుభ్రంగా ఉంచాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని ఆసుపత్రుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని పేర్కొన్నారు.