KMM: అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం 6వ డివిజన్లో నగర మేయర్ నీరజతో కలిసి సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రణాళికబద్ధంగా నగరంలో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.