KNR: జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన అమ్మ ప్రొడక్షన్స్ అధినేత, సినీ నిర్మాత నిమ్మల సతీష్ సోమవారం అకాల మరణం చెందారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్తో ఆయన మృతిచెందినట్లు తెలిపారు. సతీష్ ‘టైంపాస్’, ‘దికాప్’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల దర్శకుడు జీఎస్ గౌతమ్ కృష్ణ, హీరో దీక్షిత్, సానుభూతి తెలిపారు