విజయదశమి దేవీ మండపాల ఏర్పాటుకు https://durgautsav.net వెబ్ సైట్ ద్వారా సింగిల్ విండో పద్ధతిలో అనుమతి తీసుకోవాలని పోలీసు కమిషనర్ శంఖబ్రాత బాగ్చీ తెలిపారు. జీవీఎంసీ, ఫైర్, విద్యుత్ విభాగాల సమన్వయంతో ఈ పోర్టల్‌ని ఏర్పాటు చేశామన్నారు. నిర్వాహకులు మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయ్యి, వివరాలు నమోదు చేయాలని కోరారు. మండపాలకు క్యూఆర్ కోడ్ ఇస్తారన్నారు.