NLR: ఇరిగేషన్ కాలువలు సక్రమంగా లేక కావలి నియోజకవర్గ రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ఓఅండ్ఎం నిధులు మంజూరు చేసి కాలువల మరమ్మత్తులు చేపట్టాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అసెంబ్లీలో తెలిపారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టాలను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.