ప్రకాశం: కంభం పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను మంగళవారం సీఐ మల్లికార్జున ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిలువలను పరిశీలించి కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఎరువుల దుకాణదారులను సీఐ మల్లికార్జున తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.