ATP: మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమిస్తామని పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. కనేకల్ మండలంలో మంగళవారం పీడీఎస్యూ నాయకులతో కలిసి నిరసనలు వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలో ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశాడు. ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులకు మెడికల్ విద్య అందని ద్రాక్షలా మిగులుతుందని పేర్కొన్నారు.