మేడ్చల్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం సాధ్యమవుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. BRS పార్టీని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపించడం కోసం పార్టీ ఇప్పటికే ఇంఛార్జిలను నియమించి ప్రచారం నిర్వహిస్తుంది. మంగళవారం శ్రీనగర్ డివిజన్ మీటింగ్లో ఇంఛార్జ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.