E.G: మాజీ CM, YCP రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిని కడియంకు చెందిన రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు గురువారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల పరిశీలకులుగా తనను నియమించినందుకు గిరజాల, జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, YCP అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.