KDP: ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిద్ధవటం పెన్నా నదికి వరద నీరు భారీగా చేరుతుందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్ధవటం ఎస్సై మహమ్మద్ రఫీ సూచించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. పెన్నా నది పరివాహక ప్రాంతంలోని సిద్ధవటం, జ్యోతి, జంగాలపల్లె,వెలుగు పల్లె తదితర గ్రామాల ప్రజలు ఉండాలన్నారు.జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దన్నారు.