వచ్చే నెలలో మలేషియాలో జరిగే ఆసియాన్ సదస్సులో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కానున్నారు. ఈ సదస్సు సందర్భంగా వారి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇటీవలే ట్రంప్ ‘ఆపరేషన్ సింధూర్’పై వ్యాఖ్యలు చేయడం, భారతదేశంపై సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.