NZB: బోధన్ పట్టణంలో ఈనెల 20వ తేదీన నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఒక ప్రకటన లో తెలిపారు. ఫిల్టర్ బెడ్ క్లీనింగ్ కారణంగా పట్టణ ప్రజలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని కమిషనర్ సూచించారు.