MHBD: దంతాలపల్లి, పెద్దముప్పారం రైతు వేదికల వద్ద శుక్రవారం యూరియా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు మండల వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. దంతాలపల్లి రైతు వేదిక వద్ద బొడ్లాడ, పెద్దముప్పారంలో ఆగాపేట రైతులకు యూరియా పంపిణీ చేస్తామన్నారు. మిగతా గ్రామాల రైతులకు మరుసటి రోజు అందజేస్తామని పేర్కొన్నారు.