CTR: పుంగనూరులో టమాట ధర కిలో రూ.20 వరకు విక్రయిస్తున్నారు. కొన్ని రోజులుగా టమాటాకు సరైన ధర లభించక రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం ధర పెరగడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో టమాటా కోతలు లేక తక్కువ సంఖ్యలో కాయలు మార్కెట్కు వస్తున్నట్లు వ్యాపారులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లు వెల్లడించారు.