NRML: కుబీర్ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి కత్తి పొట్ల కలకలం చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీస్ స్టేషన్లోకి వెళ్లి ఈ దాడికి పాల్పడగా, అడ్డుకోబోయిన హోంగార్డ్ గిరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్సం నిమిత్తం నారాయణను భైంసా ఆసుపత్రికి అనంతరం అక్కడ నుంచి నిజామాబాద్‌కు తరలించారు.