ప్రకాశం: కనిగిరిలోని గార్ల పేట రోడ్డులో గురువారం వెదురు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వెదురును ఆకుపచ్చ బంగారంగా అభివర్ణించారు. వెదురు పర్యావరణానికి మిత్రుడని చెప్పారు. గ్రామీణ జీవనోపాధికి ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. ప్రపంచంలో వెదురుకి ఎంతో గుర్తింపు ఉందన్నారు.