NDL: అవుకు మండలం చర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం బాధాకరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.ప్రమాదంలో ఆరుగురు గాయపడి ఒకరు మృతి చెందడం తనకు ఆవేదన కల్పించిందన్నారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను గురువారం ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.