JGL: ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి ఉపకేంద్రం పరిధిలో విద్యుత్ కిందిస్థాయి సిబ్బందిని నియమించాలని కోరుతూ విద్యుత్ శాఖ డీఈ మధుసూదన్‌కు గ్రామస్థులు వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. భర్తీపూర్, మూలరాంపూర్, వేములకుర్తి గ్రామాలకు ఒకే లైన్ మెన్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, గత 5 సంవత్సరాలుగా సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు.