NLG: ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్నా విద్యార్థులు చదువులో రాణించేందుకు విద్యాశాఖ వినూత్న పద్ధతులను పాటిస్తుంది. సులభంగా అర్థమయ్యే విధంగా బోధించే దిశగా ఉపాధ్యాయులను సన్నద్ధం చేస్తుంది. దీనిలో భాగంగా జిల్లా విద్యాశాఖ శుక్రవారం జిల్లా స్థాయిలో బోధన సామాగ్రి మేళాను నల్గొండలోని డైట్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు డీఈవో బిక్షపతి గురువారం తెలిపారు.