TG: పార్టీ ఫిరాయింపుల అంశం రాజకీయంగా కీలక మలుపు తిరిగింది. ఆరుగురు ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్ రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, గుడెం మహిపాల్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీకి కూడా స్పీకర్ నోటీసులిచ్చి.. కేసు విచారణకు మరిన్ని ఆధారాలు సమర్పించాలని కోరినట్లు సమాచారం.