BDK: సింగరేణి సంస్థ ఓసీల్లో పని చేస్తున్న అర్హత గల ఈపీ ఆపరేటర్లకు ఎక్స్కవేషన్ Cat-D, ఎక్స్కవేషన్ Cat-C నుంచి ఎక్స్కవేషన్ Cat-Bకి త్వరలో పదోన్నతులు లభించనున్నాయి. వీటి వల్ల సింగరేణి వ్యాప్తంగా సుమారు 150 మంది ఆపరేటర్లు ప్రమోషన్లు పొందనున్నారు. ఖాళీలతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఒక్కసారి మాత్రమే కల్పించాలని నిర్ణయించారు.