MBNR: ‘ప్రజా భద్రత-పోలీసుల బాధ్యత’ అనే నినాదంతో రాజపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలు, చట్టపర అవగాహన, మాదక ద్రవ్యాల దుష్ప్రభావంపై ఎస్సై శివానంద వివరించారు. బాల్య వివాహాలు చేయొద్దని, ఫోన్లను బాధ్యతాయుతంగా వాడాలని చెప్పారు. ప్రజల సహకారంతో జిల్లాను నేర రహిత జిల్లాగా మారుద్దామని ఆయన పిలుపునిచ్చారు.