GNTR: తెనాలిలోని గురవయ్య కాలనీలో అక్రమంగా తరలిస్తున్న 9 సంచుల రేషన్ బియ్యాన్ని వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిపో రోడ్డులోని గౌడ కాలనీకి చెందిన కుందేటి విజయలక్ష్మీ, చినరావూరుకు చెందిన సయ్యద్ నాగూర్ తక్కువ ధరకు రేషన్ బియ్యం కొని, టిఫిన్ బండ్ల వారికి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.