KMM: హన్మకొండ నుంచి పాలేరు వెల్తున్న క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరిపెడ అతిధి గృహంలో కాసేపు బుధవారం రాత్రి సేదతీరారు. అనంతరం స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వవిప్ డాక్టర్ రాంచందర్ నాయక్, తో నియోజకవర్గ, జిల్లా పరిస్థితులు, ప్రధానంగా యూరియా పంపిణీ తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయశాఖ అధికారులతోనూ కాసేపు మాట్లాడారు.