TG: ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగించాలని ప్రైవేటు ఆస్పత్రుల సంఘాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. గత ప్రభుత్వంలో నెలకు రూ.50 కోట్లు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం రూ.100 కోట్లు ఇస్తోందని తెలిపారు. ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేశామని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ సేవలు లేకపోతే ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని మంత్రి వెల్లడించారు.