మేడ్చల్: ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతపూర్ శారదానగర్‌లో శివసాగర్ ఫలూడ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్‌పై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేసారు. ఇందులో నకిలీ ఐస్ క్రీమ్ తయారుచేస్తున్న దేవిలాల్ జాట్ (51) వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన సింథటిక్ ఫుడ్ కలర్‌ను ఉపయోగించి ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.