ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 102 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 292 పరుగులు చేసింది. అనంతరం 293 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 190 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఈ సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన స్మృతి మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.