VZM: బొబ్బిలిలో పలు ప్రదేశాల్లో ఇసుక లోడింగ్ చేస్తూ పట్టుబడిన ట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 11 ట్రాక్టర్లలో 9 ట్రాక్టర్లకు ఒక్కొక్క ట్రాక్టర్కు రూ.10,000 ఫైన్ విధించినట్లు బొబ్బిలి ఆర్డీవో రామ్మోహన్రావు బుధవారం రాత్రి పేర్కొన్నారు. మిగిలిన ట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు.