NZB: మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెంటనే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనీ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఆ ప్రయత్నంలోనే తామున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా పెండింగ్ బిల్లుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దామోదర్ రెడ్డి, బిక్షంగౌడ్ ఉన్నారు.