BDK: దమ్మపేట మండలం పట్వారిగూడెం జిల్లా ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం టేబుల్ టెన్నిస్ యూనిట్‌ను బుధవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. అలాగే అంగన్వాడీ టీచర్లకు నూతన వస్త్రాలు అందజేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు చేస్తుందని ఎమ్మెల్యే జారే తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.